సోపతి కుటుంబానికి సాయం

మహా వెలుగు మంచిర్యాల ( భీమారo ) 12 : ఇటీవల అనారోగ్యంతో భీమారం మండలం మద్దికల్ గ్రామానికి చెందిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు ” చింతం రాజమల్లు ” మృతి చెందిన సంఘటన తెలిసిందే.. జైపూర్ జెడ్పీహేచ్ ఎస్ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్ధులచే ఏర్పడ్డ సోపతి వెల్ఫేర్ సొసైటీ వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూ. 20 వేలు బుధవారం రాత్రి వారి భార్యాపిల్లలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సోపతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు జలంపెల్లి శ్రీనివాస్, ఉస్కమల్ల సాంబశివ, నీలాల శ్రీనివాస్, చీనూరి రాజబాబు, రాచర్లశ్రీనివాస్,కొట్రంగి నారాయణ, గాలిపెల్లి కృష్ణ, ఆకుదారి చంద్రమౌళి, కొట్రాంగి అంజన్న, బందరుకంటి లక్ష్మినారాయణ లు మరియు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు..