మహావెలుగు కురవి/ ఏప్రిల్28 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని రాజోలు గ్రామ శివారు పొలం పల్లి తండాకు చెందిన సర్పంచ్ సపవట్ మంగి కొంతకాలంగా అనరోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెరాస జిల్లా నాయకులు బజ్జురి పిచిరెడ్డి వారి మృతి దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ కోరారు. సర్పంచ్ భర్త బిచ్చును ఓదార్చి కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటామని మనోధైర్యాన్ని కోల్పోవద్దని తెలిపారు. వీరి వెంట జిల్లా టిఆర్ఎస్వి నాయకులు గుగులోతు రవి నాయక్ కురవి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఎర్రం రెడ్డి సుధాకర్ రెడ్డి నారాయణపురం సర్పంచ్ వాసు రాజు ఉప సర్పంచ్ భాస్కర్ స్థానిక పార్టీ అధ్యక్షులు బాలు నాయక్ మండల సోషల్ మీడియా అధ్యక్షులు మాలోత్ సూర్య తదితరులు పాల్గొన్నారు.
