వి. కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్, మహబూబాబాద్, ఏప్రిల్ – 30:
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ఇంచార్జీ బాధ్యతలను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ కు అప్పజెప్పినట్లు జిల్లా కలెక్టర్ కె. శశాంక ఒక ప్రకటనలో తెలిపారు.
స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ గా పనిచేయుచున్న అభిలాష అభినవ్ వ్యక్తిగత కారణాలపై ఏప్రిల్ -28 నుండి మే -20 వరకు సెలవు పై వెళ్లినందున ఇంచార్జీ బాధ్యతలను ఎం.డేవిడ్ కు అప్పజెప్పినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
