సుందరయ్య ఆశయ సాధన కోసం ఉద్యమించాలి

  • సిపిఎం పార్టీ కురవి మండల కార్యదర్శి మల్లిడి కోటయ్య

మహావెలుగు కురవి మే రిపోర్టర్ చల్ల వేణు 18 : మహబూబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి వర్ధంతి సభ ఘనంగా నిర్వహించడం జరిగింది.

అనంతరం సిపిఎం పార్టీ కురవి మండల కార్యదర్శి మల్లిడి కోటయ్య పాల్గొని మాట్లాడుతూ …
పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన మహా వ్యక్తి సుందరయ్య సార్ అని అన్నారు.

కష్టజీవుల కోసం పేదల అభివృద్ధి కోసం సుందరయ్య నిరంతరం ఉద్యమాలు నడిపించే వారని వారన్నారు. ఈ తరం కు ఆదర్శ మహా వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో నల్లపు సుధాకర్ చల్ల గొల్ల లక్ష్మి జంగంఉప్పలయ్య పోతుగంటి మల్లయ్య కట్ల కృష్ణయ్య చల్ల గొల్ల మల్లయ్య గంధసిరి పద్మ జ్యోతి బాస్ మురళి తదితరులు పాల్గొన్నారు