అందంతోపాటు, మధురమైన గాత్రం సునీత సొంతం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె తరచూ అందమైన ఫొటోలు, పలు జ్ఞాపకాలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మామిడి చెట్టు కింద కూర్చొని మామిడికాయను పట్టుకుని బ్లెస్ట్ అని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ వెనకున్న కారణమేంటి అని ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. సునీత తల్లి కాబోతోందా? అన్న ప్రశ్నలు కామెంట్ల రూపంలో దర్శనమిస్తున్నాయి. గత ఏడాది రామ్ వీరపనేనితో సునీత వివాహం జరిగింది. ఆమెకిది రెండో వివాహం. ఇంతకుముందే సునీతకు ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. తాజాగా వినిపిస్తున్న వార్తలపై, కామెంట్స్‌పై.. సునీత క్లారిటీ ఇస్తే గానీ ఏ విషయం తెలీదు.

