సువర్ణ యాదాద్రి ని దర్శించుకున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్


మహా వెలుగు రామగుండము 29: ఇల వైకుంఠపురంను తలపిస్తున్న సువర్ణ యాదాద్రిని చూడడానికి రెండు కళ్ళు చాలవని, జీవితంలో ఒక్కసారైనా దర్శించుకొని తీరవలసిన నారసింహ పుణ్యక్షేత్రం యాదాద్రి అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం జరిగిన యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు. ఆలయ శిఖర స్వర్ణ కలశానికి సంప్రోక్షణ చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మి నారసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యాదాద్రి శ్రీ నారసింహస్వామిని దర్శించుకోవడంతో తన జన్మ చరితార్థమయ్యిందని, రామగుండం నియోజకవర్గప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని వేడుకొన్నారు.