స్వరాజ్య పాదయాత్రకు సంఘీభావంగా కోటి సంతకాల సేకరణ

  • అంబేద్కర్ జయంతి(ఏప్రిల్ 14,2022) నుంచి మార్చి 15, 2023 వరకు నిర్వహిస్తాం.
  • దళిత్ శక్తి ప్రోగ్రాం మండల కన్వీనర్ సుంచు మురళి మహారాజ్

మహావెలుగు, ప్రతినిధి, మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ 13: తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల మంది బీసీ ,ఎస్సీ ,ఎస్టీ ల రాజ్యస్థాపన కై 10 వేల కిలో మీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేపట్టిన సందర్భంగా…
అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14, నుంచి మార్చి 15, 2023 వరకు స్వరాజ్య పాదయాత్రకు సంఘీభావంగా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్లుగా దళిత శక్తి ప్రోగ్రాం -DSP అధినేత డా. విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు దళిత శక్తి ప్రోగ్రాం మండల కన్వీనర్ సుంచు మురళి మహారాజ్ తెలిపారు.

10 వేల కిలో మీటర్ల స్వరాజ్య పాదయాత్ర 2022 మార్చి 15 నుండి కల్వకుర్తి నుండి ప్రారంభమైన సంగతి మీ అందరికీ తెలిసిందేనని, ఈ కాలి నడక నిరాటంకంగా విజయవంతం అవుతూనే ఉందనీ ఇప్పటికి 582 కిలోమీటర్లు సాగిందనీ, ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందనీ తెలియజేశారు.

ఈ స్వరాజ్య పాదయాత్రను మరింత విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.