మహా వెలుగు రామగుండం ఏప్రిల్ 13: రామగుండం బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో రామగుండం తహశీల్దార్ రమేష్ కి మండలం లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన వారికి ఇవ్వాలని, 57 సంవత్సరాలు నిండి గత సంవత్సరం ఆగస్టు నెలలో ఆన్లైన్ చేసుకున్న వృద్దులకు పెన్షన్లు మంజూరు చేయాలని అలాగే ధరణి పోర్ట్ లో జరిగిన అవకతవకలు సరిచేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కే. కనకరాజ్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారం లోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ యాభై ఏళ్లు నిండిన వారందరూ వృద్ధాప్య పింఛన్ల కోసం ఆన్లైన్ చేసుకోవాలని చెప్పి ఎనిమిది మాసాలు గడుస్తున్న పట్టించుకోవడం లేదని, ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వృద్దులు పెన్షన్ కోసం ఆశతో ఎదురుచూస్తు ఆవేదన చెందుతున్నారు అని అన్నారు.
అదే విధంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో 850 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా 250 నిర్మాణం చివరి దశలో ఉండగా 600 ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయనీ అన్నారు. రామగుండం మండలం రూరల్ ప్రాంతం లో 550 ఇండ్ల నిర్మాణంలో పభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. అలాగే ధరణి పోర్ట్ వల్ల చాలా మంది భూ హక్కు దారుల సర్వే నంబర్లు మాయం అయినాయి అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేనిపక్షంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోశిక మోహన్, ప్రజా సంఘాల నాయకులు కందుకూరి రాజరత్నం, శనిగరపు చంద్ర శేఖర్, అబ్దుల్ కరీం, రేణుకుంట్ల ప్రీతం తదితరులు పాల్గొన్నారు.
