- కొంపముచ్చిన నాసిరకం పనులు
- తెగుతున్న గొల్లవాగు ప్రాజెక్టు కాలువ
మహా వెలుగు ,మంచిర్యాల భీమారo 10 : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఎల్కేశ్వరం శివారులోని గొల్లవాగు ప్రాజెక్టు మెయిన్ కాలువ తెగిపోయింది దీంతో వర్షం నీరు వరదగా పారుతుంది నాసిరకం పనులే కొంపముంచింది.
ఎల్కేశ్వరం గ్రామ శివారులోని గొల్లవాగు ప్రాజెక్టు మెయిన్ కాలువ భీమారం నుండి చెన్నూరు లోని పొలాలకు సాగునీరును అందిస్తుంది గత కొంతకాలంగా అందులో తుంగ పేరుకుపోవడంతో పాటు అధికారులు అలసత్వం వహించడంతో ఆ కాల్వ కాస్త తెగిపోయింది. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ రెండు రోజుల వర్షానికి ఇలా గొల్లవాగు ప్రాజెక్టు కాలువ తెగిపోవడం వివాద స్పదం అవుతుoది.