మహా వెలుగు హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బీజేపీ ఎమ్మెల్యే ల సస్పెన్షన్ పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సస్పెండైన ఎమ్మెల్యే లు స్పీకర్ ముందుకు వెళ్లాలని తెలిపింది. సభాపతి సమస్యను పరిష్కరిoచే దిశగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
అసెంబ్లీ కి గౌరవ అధ్యక్షులు స్పీకరేనని , దాని పై స్పీకర్ దే తుది నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమయ్యేలోపే స్పీకర్ ముందు ఎమ్మెల్యే లు అభ్యర్థన చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. సభాపతి సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని ,మనది పార్లమెంటరీ డేమోక్రసి అని సభలో ప్రజాప్రతినిధులు ఉంటేనే పార్లమెంట్ దేమోక్రసి బలపడుతుoదని గుర్తు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే లు సభ హక్కులు ఉల్లంఘన పాల్పడినట్టు ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు చెప్పింది.