తెలంగాణ లో మళ్ళీ పరువు హత్య ….

మహా వెలుగు , యాదాద్రి : యాదాద్రి జిల్లాలో పరువు హత్య వెలుగు చూసింది. యాదగిరి గుట్టలో హోమ్ గార్డ్ గా పనిచేసిన రామకృష్ణ గౌడ్ ను గుండాల ప్రాంతంలో హత్య చేసి సిద్దిపేటలో పడేశారు. గతంలో యాదగిరిగుట్టలో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్న సందర్బంలో భార్గవి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

ఇద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు దాన్ని జీర్ణించుకోలేక పరువు హత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్నారు. అక్రమ చర్యలకు పాల్పడుతున్నాడని ఆరు నెలల క్రితం రిమువల్ ఫ్రొం సర్వీస్ అయిన రామకృష్ణ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.

అమ్మాయి తండ్రి వెంకటేష్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రౌడీ షీటర్ లతీఫ్ పక్క ప్రణాళిక ప్రకారం కిడ్నాప్ చేసి ఈ హత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లి పరిధి లో మృత దేహం లభ్యమైంది

భువనగిరికి చెందిన భార్గవి అనే యువతిని రామకృష్ణ 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.. అప్పటినుంచి కక్ష పెంచుకున్న యువతి తండ్రి వెంకటేష్ పక్కా ప్లాన్‌తో రామకృష్ణ ను హత్య చేయించాడు.

రెండు రోజుల క్రితమే రామకృష్ణను ట్రాప్ చేసి, మాయ మాటలు చెప్పి హైదరాబాద్‌కు పిలిపించారు.. అనంతరం కిరాతకంగా హత్య చేసి, సిద్దిపేట జిల్లాలో మృతదేహాన్ని పడేసి వచ్చినట్లు సమాచారం.

అయితే హోంగార్డుగా ఉద్యోగం చేస్తున్న రామకృష్ణ గుప్త నిధుల కేసులో కొన్ని నెలల క్రితం విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు. అప్పటి నుంచి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

కులాంతర వివాహం చేసుకున్న రామకృష్ణను యువతి తండ్రి వెంకటేష్ హైదరాబాద్ కు చెందిన రౌడీ షీటర్ లతీఫ్ కు సుఫారీ ఇచ్చి హత్య చేయించాడు. రామకృష్ణ డెడ్ బాడీ సిద్దిపేట జిల్లా, కుకునూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని
లకుడారం గ్రామం వద్ద లభించింది.

తన తండ్రి పక్కా ప్లాన్ తోనే హత్య చేయించాడని రామకృష్ణ భార్య భార్గవి పోలీసులకు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుప్త నిధుల కేస్ లో సంవత్సరం క్రితం సస్పెండ్ అయిన తర్వాత రామకృష్ణ భువనగిరి తాతా నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

రెండు రోజుల క్రితం ముగ్గురు మహిళలు రామకృష్ణకు ఫోన్ చేసి హైదరాబాద్ లో ల్యాండ్ కొంటామని, మధ్యవర్తిగా ల్యాండ్ చూపించాలని కోరడంతో హైదరాబాద్ బయలుదేరి వెళ్లిన రామకృష్ణ అక్కడ అదృశ్యమయ్యాడు.

గతంలోనూ ఒక సారి తన కూతురు భార్గవిని కిడ్నాప్ చేసేందుకు వెంకటేష్ యత్నించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.