తెలంగాణలోపండిన ప్రతి గింజెను కేంద్రం కొనుగోలు చేయాలి

మహా వెలుగు పెద్దపల్లి ప్రతినిధి 24 : తెలంగాణ లో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కోనేదాక విశ్రమించేది లేదని, తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నారని ,పంజాబ్ తరహాలో తెలంగాణ లో ధ్యానం కోనాలని రామగుండం ఎమ్మెల్యే జిల్లా టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ తెలిపారు.
రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్రం ప్రభుత్వం కొనేదాకా విశ్రమించేది లేదని, తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనకుండా నానా తంటాలు పెడుతోందని పంజాబ్ కో నీతి.. తెలంగాణకు నీతిలాగా… బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.
పంజాబ్ లో ప్రతీ సంవత్సరం రెండు పంటల ఎఫ్ సీఐ ద్వారా కేంద్రమే కొంటున్నట్టు తెలంగాణ లో కూడా వానాకాలం వడ్లను, వేసంగి వడ్లను ,కేంద్రమే పంజాబ్ తరహాలోనే తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నడుస్తుంది రైతు సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్రంలోని రైతులను రాజులుగా చేయాలన్న మహా సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో రైతు సంక్షేమ పథకాలను అమలు చేసి రైతుల కన్నీరు తుడుస్తున్నారని. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు రాజ్యంగ పరి రక్షణ కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామ మండల కార్పోరేట్ స్థాయిలో నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నామన్నారు. గ్రామ పంచాయతీ లో తీర్మాణాలు, రహదారుల దిగ్బదం, నిరసన దీక్షలు రైతుల ఇళ్లపై నల్ల జెండా ఎగరవేయడం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. రైతు రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ఆదేశం మేరకు తెలంగాణా రైతులపట్ల కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వివక్షత కు వ్యతిరేకంగా జిల్లాలో ఈనెల 26 నాడు అన్ని గ్రామ పంచాయతీల తీర్మానాలు,27 నాడు – అన్ని మండల పరిషత్ ల తీర్మానాలు, 28 నాడు – అన్ని మార్కెట్ కమిటీలు,అన్ని పిఏసీఎస్ ల తీర్మానాలు, 29 నాడు – డిసిసిబి, డీసీఎంఎస్ తీర్మానాలు, 30 నాడు జిల్లా పరిషత్ తీర్మానం, 31 నాడు అవసరం ఉన్న చోట మున్సిపాలిటీల తీర్మానాలు వెనువెంటనే కొరియర్ పోస్టుల ద్వారా ప్రధాన మంత్రి కి చేరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.