వికలాంగుల బందు పథకం తక్షణమే అమలు చేయాలి

  • కురవి ఎం.పీ.డీ.వో సరస్వతి కి వినతి పత్రం అందజేసిన
    వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పీ.ఆర్.డి) జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా.

మహావెలుగు కురవి/ మే9 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి) ఆధ్వర్యంలో వికలాంగుల బంధు పథకం వికలాంగులందరికీ తక్షణమే అమలు చేయాలని. కురవి ఎం.పీ.డీ.వో సరస్వతికి వినతి పత్రం అందజేసిన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి) జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా ఈ సందర్భంగా మాట్లాడుతూ.

వికలాంగుల బందు, కొత్త పింఛన్లు, 57 సంవత్సరాల పింఛన్లు, వికలాంగులకు వ్యక్తిగత రుణాలు ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా వ్యక్తిగత రుణాలు 5 లక్షల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు ఏ కొలతలు లేకుండా రోజుకు 600 రూపాయలు వికలాంగుల అందరికీ ట్రై సైకిల్, మోటార్ వెహికల్స్, వీల్ చైర్స్, వినికిడి మిషన్ లాంటివి వికలాంగుల అందరికీ వెంటనే అమలు చేసి. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వికలాంగులకు వెంటనే ఇవ్వాలి. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని భాగముగా వికలాంగుల అందరికీ 150 రోజుల పని తక్షణమే కల్పించాలి.

వికలాంగుల అందరికీ జాబ్ కార్డులు లేనివారికి జాబ్ కార్డులు తక్షణమే ఇవ్వాలి. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న రోజు వారి కూలీలకు నీళ్లు లేవు, నీడ లేదు, బోనస్ కూడా లేవ్వని. గడ్డపార, పారకు డబ్బులు మెట్లకు సైకిల్ సెల్ ఫోన్ ల్లు కొనివ్వాలని వికలాంగులకు 2016 నూతన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో షేక్. మున్నా, ఎల్ది మహేష్,జి.బిక్షం, అజ్మీర వీరు,బత్తిని వెంకన్న, ఎన్. మణేమ్మ తదితరులు పాల్గొన్నారు.