తెలంగాణ విమోచనన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

మహా వెలుగు , హైదరాబాద్ 03 : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విమోచనన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల తరహాలోనే దేశంలో హైదరాబాద్‌ రాష్ట్రం అంతర్భాగమైన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ వజ్రోత్సవ వేడుకలను ఈ నెల 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించింది.

ప్రగతిభవన్ లో మూడు గంట‌ల పాటు కేబినెట్ భేటీ జరిగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షత‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో మంత్రులు, ప‌లువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాలు, పాల‌నాప‌ర‌మైన అంశాలు, తెలంగాణ విలీన వ‌జ్రోత్సవాల నిర్వహ‌ణ‌, విద్యుత్ బ‌కాయిలు, ఇత‌ర అంశాల్లో కేంద్రం వైఖ‌రి, పోడు భూములు, ప్రభుత్వ ఉద్యోగుల‌కు డీఏపై కేబినెట్ లో చర్చించారు.