ఖనిలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మహా వెలుగు రామగుండము 29: గోదావరిఖని గాంధీనగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు, టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి, కంది చంద్రయ్య అధ్యక్షతన 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి కళావతి చే జెండా ఆవిష్కరించారు. ఎలేశ్వరం చంద్రమౌళి కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజల వీరా అన్న ఎన్టీఆర్ ఆశీర్వాదాలతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు అభిమానులు కంకణబద్ధులై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండవేని ఓదెలు, ఎండి వాజిద్, మైదం కొమురయ్య, వై అంకి రెడ్డి, పెగడపల్లి రాజనర్సు, ఎం దామోదర్ రెడ్డి, చిటికెల రాజలింగు, సుందిల్ల స్వామి, రాష్ట్ర మహిళా కార్యదర్శి బి కళావతి, చిట్యాల అశ్విని, కనకం పోచమల్లు, కంది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.