వాహనదారులకు గుడ్న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ పొడిగింపు.. ఎప్పటివరకు అంటే..?
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించుకునేందుకు పోలీసులు వాహనదారులకు డిస్కౌంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని గడువు మార్చి 31తో ముగియనుంది. అయితే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం, క్లియర్ చేసుకోవాల్సిన చలాన్లు వుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలాన్లు చెల్లించుకునేందుకు మరో 15 రోజులు గడువు ఇస్తున్నట్లు శుభవార్త చెప్పింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ బుధవారం తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని, వీటి విలువ 840 కోట్ల రూపాయలని ఆయన తెలియజేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానా క్లియర్ చేయడం జరిగిందనీ, రాష్ట్ర వ్యాప్తంగా 52% మోటారు వాహన యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు.