టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి గవర్నర్ ఏమన్నారంటే…..

మహా వెలుగు , హైదరాబాద్ : తాను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని అనలేదని.. తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీ కరించారని గవర్నర్ తమిళిసై అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి గవర్నర్ ఏమన్నారంటే.. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్‌తో విభేదించినా, రాజ్‌భవన్‌ను గౌరవిస్తున్నారు. నేను గవర్నర్‌గా మాత్రమే పనిచేస్తున్నా. నాకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారు. ఆధారాలు లేకుండా విమర్శలా..? మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శిస్తున్నారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నేను ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా? ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఏ పదవిలో ఉన్నా, ప్రజలకు సేవ చేయుటం నా లక్ష్యం. ప్రొటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది. గిరిజనుల మంచి కోసం వాళ్ల ప్రాంతాల్లో పర్యటిస్తున్నా. ఇన్విటేషన్లను పొలిటికల్‌గా చూడొద్దు అని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు.