మహా వెలుగు రామగుండము 02: రామగుండం కార్పోరేషన్ 48వ డివిజన్ లో విద్యా లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో కార్పోరేటర్ పోన్నం శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. డివిజన్ ప్రజల కోసం ఉగాది పచ్చడి, బూరేలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పోన్నం మాట్లాడుతూ.. ఆనందాల తియ్యదనం, అవమానాల చేదు, కష్ట నష్టాల కారం, విమర్శల పులుపు, నిరాశల వగరు, షడ్రుచులన్నింటినీ సమన్వయపరుచుకుంటూ, ఆకులు రాలిన చెట్ల వలె, ఆశలను కోల్పోయిన మనుషుల్లో కొత్త చిగుళ్లు తొడిగి, ధైర్యాన్నిచ్చే సర్వ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ, డివిజన్ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు బెందె నాగభూషణం గౌడ్, నూనె ఓదేలు జేట్టి మల్లేష్, అలాగే భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
