- మహబూబాబాద్ లో వ్యబిచార ముఠాగుట్టు రట్టు చేసిన మహబూబాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు..
- వివరాలు వెల్లడించిన జిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్..
మహా వెలుగు ప్రతినిధి మహబూబాబాద్ 12.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యబిచార ముఠాగుట్టు రట్టు చేసిన మహబూబాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో మహబూబాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులకు నమ్మదగిన సమాచారం మేరకు మహబూబాబాద్ నగరంలో కొంత మంది ముఠాగా ఏర్పడి వ్యబిచారం నిర్వహిస్తునట్టుగా సమాచారం రాగా వెంటనే టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్, మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బందిని తీసుకొని మహబూబాబాద్ లోని రెడ్డిబజార్ లో గల ఒకగృహము మీద దాడి చేయగా ఆ గృహములో సర్వోదయ సంస్థలో పని చేస్తున్న కొందరు వ్యక్తులు మరియు ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యబిచారం నిర్వహిస్తున్న కొందరిని అదుపులో తీసుకోవడం జరిగింది.
పట్టుబడిన వారి వివరాలు.. 1). బానోత్ రవి S/o తులస్య R/o పిల్లిగుండ తండా మహబూబాబాద్ 2) బాదావత్ సరోజ, W/o జమ్లా, R/o పర్వతగిరి, మహబూబాబాద్.. 3) మాలోత్ మంగిలాల్ లోకేష్, వయస్సు 32 సంవత్సరాలు, ఆటో డ్రైవర్ R/o హరిసింగ్ తండా, రాజోలు (మధ్యవర్తి & రవాణా), 4) భూక్య కెన్కి W/o మంగిలాల్, R/O బంచరాయితండా, 5) బాదావత్ రాములు S/o దాన్ల, R/o సోమ్లా తండా.. పై వ్యక్తులు మహబూబాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల మహిళలతో వ్యబిచారం నిర్వహిస్తున్నారు. అదే మాదిరి ఈరోజు కూడా కొంతమంది మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తుండగా టాస్క్ ఫోర్సు పోలీసులు వారిని పట్టుకున్నారు.
స్వాధీనపు వివరాలు..
రెండు కాటన్ బాక్స్ ల నిరోద్ పాకెట్స్.
10 మొబైల్ ఫోన్స్.
ఒక ఆటో (TS 261728).
రెండు ద్విచక్ర వాహనాలు,
ఈ కేసులో మరో నలుగురు పరారీలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం సేకరించి నేరస్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్సు సిఐ జి మోహన్, మహబూబాబాద్ టౌన్ సిఐ వై సతీప్, టాస్క్ ఫోర్సు ఎస్ఐలు కే జగదీష్, టి రామారావు లతోపాటు టాస్క్ ఫోర్సు సిబ్బందిని రివార్డ్స్ తో జిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్ అభినందించారు.
