ఈ వయసులో లో ఎంత అద్భుతంగా సేవచేయడం అభినందనీయమని , గర్వకారణమని , మంచిర్యాల పట్టణ సిఐ నారాయణ నాయక్ ,ఎస్సై కిరణ్ కుమార్ , సీవీ రామన్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సయ్య పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరాన సమ్మక్క – సారక్క గద్దెల జాతరలో ఆలయ సిబ్బంది తో పాటు ,పోలీస్ల్ తో కలిసి ఎన్ఎస్ఎస్ , ఎన్ సి సి విద్యార్థులు విధులు నిర్వహిoచగా ‘పట్టణంలో వాలంటీర్ల అభినందన’ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐ ,ఎస్ఐ ,ప్రిన్సిపాల్ ,ఆలయ కమిటీ చైర్మన్ తో కలిసి మాట్లాడారు. సమ్మక్క సారలమ్మ జాతరలో నాలుగు రోజులపాటు వాలంటీర్లుగా విధులు నిర్వహించిన సివి రామన్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ మరియు ఎన్ సి సి విద్యార్థుల కు ప్రశంశ పత్రాలతో పాటు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారు అభినందించి ,సత్కరించారు. రేపటి భవిష్యత్ లో పోలీస్ డ్రెసింగ్ లో చూసేల విద్యార్థులు ప్రణాళికలు చేసుకోవాలని తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ .. వాలంటర్ గా ఉండి సేవ చేయడం అదృష్టంగా భావించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాపల్లి రాజన్న , ఎన్ సి సి ఇంచార్జి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.