- మంథని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మహా వెలుగు, రిపోర్టర్ ప్రసాద్ అనుసూరి మంథని నియోజకవర్గం ఏప్రిల్ 26; సేవా నిరతికి నిలువెత్తు నిదర్శనం మెదక్ చర్చ్ శాంతి, సౌభాతృత్యానికి ఆలవాలం ,వందేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యమని
మంథని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు.

మహనీయుల జన్మస్థలాలు, పుణ్యస్థలాల సందర్శనలో భాగంగా మంగళవారం మంథని నియోజకవర్గానికి చెందిన చర్చ్ ఫాస్టర్లతో ప్రతిష్టాత్మక మెదక్ చర్చ్ ను సందర్శించారు. ఈ సంధర్భంగా చర్చ్ ఫాస్టర్ తో చర్చ్ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఇంగ్లాండ్ కు చెందిన చార్లెస్ వాకర్ ఫాసినెట్ సుమారు 110 సంవత్సరాల క్రితం ఈ చర్చ్ నిర్మాణం చేపట్టగా నిర్మాణం పూర్తవడానికి 10 సంవత్సరాలు పట్టిందని తెలిపారు.
1914లో నిర్మాణం ప్రారంభం కాగా 1924 లో పూర్తై 1924 డిసెంబర్ 25 న ప్రారంభమైంది. ఆసియాలోనే అతి పెద్దదైన ఈ చర్చ్ ప్రపంచంలో రెండోదిగా పేరుగాంచిందని

మెదక్ డైసిస్ లో భాగంగా నడిస్తన్న ఈ చర్చ్ నిర్మాణ సమయంలో చాలెస్ వాకర్ ఫాసినెట్ తన స్వంత ఆస్థులను అమ్మి ఈ చర్చ్ కు 1000 ఎకరాల భూమిని అప్పగిచగా అందులో 700 ఎకరాలు పేదలకు పంపిణీ చేశారని. ప్రస్తుతం 300 ఎకరాలను వివిధ ప్రజా అవసరాలకు వినియోగిస్తున్నారని వారు తెలిపారు. శాంతి, సౌభాతృత్యాలకు ఆలవాలంగా, సేవా నిరతికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ చర్చ్ వందేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యమని తెలిపారు.
తెలంగాణలో వివిధ మతాల వారు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్నారని ఎవరి మతాన్ని వారు విశ్వసిస్తూ ఇతర మతాల్ని గౌరవించడమే కాకుండా మతాలకతీతంగా సేవ చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ సెక్యులర్ ప్రభుత్వంగా అందరికీ సంక్షేమ పథకాలి అమలు చేస్తున్నదని కొనియాడారు.

మహనీయుల చరిత్రను ప్రజలకు వివరించడంతో పాటు వివిధ మతాల పుణ్యస్థాలలను దర్శించి వాటి ప్రాశస్త్యాన్ని మంథని ప్రజలకు తెలిఅజేయడమే తన ధ్యేయమన్నారు. అందులో భాగంగానే అంబేద్కర్, పూలే, కొమ్రంభీం, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్ బందగి లాంటి మహనీయుల జన్మస్థలాలు నాగ్ పూర్ తాజోద్దిన్ బాబ, మెదక్ చర్చ్ లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, మైనారిటీ నాయకులతో కలిసి సందర్శించినట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు జక్కు రాకేష్, పూదరి సత్యనారాయణ గౌడ్, తగరం శంకర్ లాల్, పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, అలువెల్లి వీరారెడ్డి, ఫాస్టర్స్ అంకరి కుమార్, కాంపెల్లి దాసు, వల్లూరి ప్రభాకర్, ఆదాం, గట్టయ్య, జాన్ పాల్, లొయాజ్, జక్కయ్య, తాండ్ర మార్క్ తదితరులు పాల్గొన్నారు.
