శ్రీ వరదరాజుల స్వామి వారి ఆలయంలో చోరీ

మహావెలుగు కురవి/ఏప్రిల్24 రిపోర్టర్ చల్లా వేణు : కురవి మండలంలోని రాజోలు గ్రామం
శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన సంఘటన ఆదివారం రోజున చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే దొంగలు హుండీలోఉన్న మూడు లక్షలు,విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఈ దొంగతనం అర్ధరాత్రి ఒంటి గంట కు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. కంచర్లగూడెం నుంచి బలపాల వెళ్ళు రాజోలు క్రాస్రోడ్డు వద్ద దొంగలు వాహనాన్ని నిలిపి చింతల తండ వైపు వెళ్లే దగ్గర నడుచుకుంటు వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. కురవి ఎస్సై రాము నాయక్ దొంగలను
సీసీ ఫుటేజీ ఆధారంగా పట్టుకోవడానికి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు.