మహా వెలుగు కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్‌కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నాలుగు వాహనాలు ఒకేసారి ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో కోడిగుడ్ల వ్యాన్ బోల్తా పడటంతో స్థానికులు అందులో ఉన్న గుడ్లను ఫ్రీగా పట్టుకెళ్లేందుకు ఎగబడ్డారు. కోడిగుడ్ల కోసం స్థానికులు కక్కూర్తి పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా వదలరనే సామెతను నిజం చేశారు కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు ప్రజలు. రహదారిపై యాక్సిడెంట్ జరిగింది. రెండు వాహనాలు కాదు…నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోడిగుడ్లు తరలిస్తున్న వ్యాన్ కూడా ఉంది. అది కూడా ప్రమాదంలో అదుపుతప్పి బోల్తా పడింది

ప్రమాదం కారణంగా వ్యాన్‌లో ఉన్న కోడిగుట్ల ట్రేలు పూర్తిగా కిందపడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు.
ప్రమాదం ఎలా జరిగింది ? ఎవరికైనా దెబ్బలు తగిలాయా ? అంబులెన్స్‌కి ఫోన్ చేద్దామని విషయాన్ని పక్కనపెట్టి..కిందపడిపోయిన కోడిగుడ్లు వ్యాను కోడిగుడ్ల వ్యాన్ బోల్తా పడిన విషయం దారిపోయే ఒకరిద్దరి ద్వారా చుట్టు పక్కల స్థానికులు తెలుసుకొని పిల్లలు, పెద్దలు, మహిళలు, మగవాళ్ల
కరీంనగర్ జిల్లా జగిత్యాల రహదారి ఇస్లాంపూర్ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ రెండు వ్యాన్‌లతో పాటు ఓ ప్రైవేట్ బస్ ఒకదానితో మరొక ఈ ప్రమాదంలో కోడిగుడ్ల వ్యాన్ పూర్తిగా రోడ్డు పక్కకు పడిపోవడంతో లోపలున్న గుడ్ల ట్రేలు విరిగిపోయాయి. గుడ్లు పగిలిపోయాయి. ప్రమాదం జరిగి వాహనాలు రోడ్డు పక్కన పడివుంటే ..అందులోని ట్రేలలో కోడిగుడ్ల కోసం స్థానికులు ఎగబడటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది ప్రమాదం జరిగిన వ్యాన్‌లోకి ఎక్కి మరీ జనం కోడిగుడ్లను ఎత్తుకెళ్లేందుకు ఎగబడ్డారు. ఒకరి కంటే మరొకరు మోయలేనన్ని ట్రేలను పట్టుకొని వెళ్లారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్‌కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నాలుగు వాహనాలు ఒకేసారి ఒకదానికి మరొకటి ఢీ కొట్టాయి..

