మహా వెలుగు రామగుండము 05: మంగళవారం గోదావరిఖని గాంధీ నగర్ లో సీపీఐ నాయకులు, ప్రజానాట్యమండలి సీనియర్ కళాకారులు కవ్వంపల్లి స్వామి సతీమణి అరుణ 3వ వర్ధంతిని పురస్కరించుకున్నా…. సందర్భంగా యండిహెచ్ డబ్ల్యు యస్ ఆశ్రమంలోని పిల్లలకు అన్నదానం చేసారు. ఈ కార్యక్రమంలో కళాకారులు మ్యాజిక్ రాజా మాట్లాడుతూ..మన ఆత్మీయుల జయంతులైనా, వర్ధంతులైనా ఇంటికే పరిమితం కాకుండా, వారి స్మృతిలో సమాజంలోని అన్నార్తులకు సాయం చేయాలనే ఆలోచన రావడం ప్రశంసనీయమన్నారు. స్వామిని, ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్వామి కుటుంబ సభ్యులు ప్రదీప్, కోమలత, అక్కపాక రాజయ్య, సామవేదమణి, వరుణామృత, వెంకటేష్, లావణ్య, సీపీఐ నాయకులు, మిత్రులు మడ్డి ఎల్లయ్య గౌడ్, కనకరాజు, రంగు శ్రీనివాస్ గౌడ్, రమేష్ కుమార్, శనిగరపు చంద్రశేఖర్, పి. చంద్రపాల్, ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
