- ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
- విప్ సుమన్ అడగగానే గట్టు మల్లన్ కు రూ.కోటి ప్రకటించిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.
మంచిర్యాల : దఫదఫాలుగా గట్టు మల్లన్న స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ప్రతి సంవత్సరం కోటి నుండి నాలుగు కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తూ ,గట్టు మల్లన్న స్వామి తో పాటు వేలాల అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. సోమవారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మీ తో కలిసి వేలాల గ్రామం నుండి గట్టు మల్లన్న స్వామి ఆలయం వరకు రూ. 2 కోట్లతో నూతన రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గట్టు మల్లన్న స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడారు. చెన్నూర్ నియోజకవర్గంలో గాంధారి మైసమ్మ ఆలయం , మందమరి పట్టణం ఆనుకొని సమ్మక్క – సారక్క ఆలయం అదే విధంగా కత్తెరశాల మల్లికార్జున ఆలయం చెన్నూరు లో మధునం పోచమ్మ ఆలయాలు చెన్నూరు నియోజవర్గంలో ఉన్నాయని వాటికీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. అంతేకాకుండా వేలాల నుండి గట్టుమల్లన్న వరకు రోడ్ల నిర్మాణాలు అవుతున్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే నాలుగైదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం నాలుగు నుండి ఐదు కోట్లు రూపాయలు మంజూరు చేయుంచుకొని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు రానున్న రోజుల్లో రూ. 20 కోట్ల అభివృద్ధిని చేయనున్నట్లు వారు తెలిపారు. దానిలో భాగంగానే రూ. 2 కోట్ల నిధులు మంజూరైనట్లు వారు తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సైతం కోటి రూపాయలను అడుగగానే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా రెండు ఎకరాల ఫారెస్ట్ స్థలంను కేటాయించాలని కోరగా , మరో చోట భూమి ఇస్తే రెండు ఎకరాలు దేవాదాయ శాఖ ఇస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఆలయాన్ని అబ్దుతంగా తీర్చిదిద్దుతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ,జడ్పిటిసీ మేడి సునీత – తిరుపతి , ఏసీపి నరేందర్ , తదితరులు ఉన్నారు.
