మహా వెలుగు మంథని 31: మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేతకు స్వాగతం లభించింది. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులు ఈసందర్భంగా ఎంపి వెంకటేష్ నేత ను సన్మానించారు. ముత్యలమ్మవాడలో రూ.4.50 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్డును పెద్దపల్లి జిల్లా జడ్పి చైర్మన్ పుట్ట మధు , మున్సిపల్ చైర్మన్ శైలజ తో కలిసి ప్రారంభించారు.