వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, నేరడ నూతన గ్రామ కమిటీ ఎన్నిక.

మహావెలుగు కురవి/ఏప్రిల్22 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాద్ జిల్లా కురవి మండలంలోని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నేరడ గ్రామములో నాలుగవ మహాసభ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా అధ్యక్షతన నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……

మహాసభల స్ఫూర్తితో వికలాంగుల హక్కులకై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. సంఘం ఆవిర్భావం నుండి పాలక వర్గాలపై రాజీలేని పోరాటాలు నిర్వహించి. అనేకమైన చట్టాలను సాధించిన చరిత్ర ఎన్.పి.ఆర్.డి దే అన్నారు. ఈ సభలో అధ్యక్ష కార్యదర్శులుగా మడ్డూరి నాగభూషణం, నీలం నరేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా తుడుం ప్రశాంత్, కొండబత్తుల అరవింద్,కుంచం మల్లేష్, సహాయ కార్యదర్శులుగా కోడూరి ప్రభాకర్, దుస్స మంగయ్య, బండోజు పద్మ, నూకల సుజాత మరో 15 మంది తో నూతన కమిటీని ఎన్నుకున్నారని తెలిపారు.