- విలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా పిలుపు
మహావెలుగు న్యూస్ రిపోర్టర్ చల్ల వేణు కురవి:21కురవి మండల కేంద్రంలో వికలాంగుల సమస్యల సాధనకై 25వ తేదీన జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయ్యా లని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మహ-బాద్ జిల్లా కమిటీ కార్యదర్శి సయ్యద్ ఖాజా వికలాంగులకు పిలుపునిచ్చారు. మండలంలో బుధవారం నాడు నేరడ గ్రామంలో సంఘం సమావేశం మడ్డూరి నాగభూషణం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఖాజా పాల్గొని మాట్లాడుతూ. 57 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ప్రభుత్వం నీటిపాల్ రాతలుగా మారాయని వారు విమర్శించారు. సంక్షేమ పథకాల్లో వికలాంగులను విస్మరిస్తున్నారని అన్నారు.

మండల కేంద్రంలో వికలాంగుల కమ్యూనిటీ హల్ కట్టించాలని చట్టం ఉన్నప్పటికీ అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వ్యక్తిగత రుణాలు మండల కేంద్రంలో ఇంటి స్థలం ఇచ్చి మోడ్రన్ కాలనీ ఏర్పాటు చేయ్యా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం ప్రశాంత్, కోడూరు ప్రకాష్, కురకుల అశోక్, సుజాత, రాంబాబు,నీలం నరేష్, ఇటుకల వెంకటమ్మ, దుస్స మంగమ్మ, ఇటుకల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
