వికలాంగులకు అండగా తెలంగాణ సర్కార్

  • ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్

వికలాంగులకు అండగా తెలంగాణ సర్కార్ ఉంటుందని ఏ ప్రభుత్వం చేయలేని పనులు తెలంగాణ ప్రభుత్వం చేసి పెడుతుందని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యలయంలో వికలాంగులకు సహాయ ఉపకారణాల్లో భాగంగా వాహనాలు, ల్యాప్ టాప్ లను
రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ఛైర్మెన్ వాసుదేవ రెడ్డి , జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి , బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య , కలెక్టర్ భారతి హోళీ కేరి తో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు.

స్కూటర్ పంపిణీలో వికలాంగుల తో మాట్లాడుతున్న బాల్క సుమన్