తెలంగాణ : చెన్నుర్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు చేయాలని , ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావుని కలిసి నియోజకవర్గంలో ఉన్న రోడ్ల కు నిధులు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా చెన్నూర్ మండలo ఆగ్రాజపల్లి నుండి ముత్త రావుపల్లి వరకు , అక్కడ నుండి అన్నారం బ్యారేజ్ జంక్షన్ వరకు నూతన రోడ్డు నిర్మాణం కోసం రూ.6.08 కోట్లా రూపాయలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రికి విప్ బాల్క సుమన్ వినతి పత్రం ను అందించారు.కాగ చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు ‘సుమన్ మనుసు’ ఎంత మంచిదో అని నియోజకవర్గ ప్రజలు కొనియాడారు.