- ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫైర్
- బీజేపి ,కాంగ్రెస్ నాయకులను టిఆర్ఎస్ పార్టీలో కండువా కప్పి ఆహ్వానిoచిన బాల్క సుమన్
మంచిర్యాల మహావెలుగు : మన రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రం బండి సంజయ్, రేవంత్ రెడ్డిలని మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు. మందమర్రిలో పట్టణంలో ఆదివారం బీజేపీ, కాంగ్రెస్, మందమర్రి పట్టణానికి చెందిన వెయ్యి మంది కార్యకర్తలు, నాయకులు టిఆర్ఎస్ పార్టీ లో లోకి ఆహ్వానిoచి కండువాలు కప్పారు. ఆహ్వానించిన ఆనంతరం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా గత పాలకుల ధన దాహానికి వెనుకకు నెట్టి వేయబడిన ప్రాంతం చెన్నూరు నియోజకవర్గమని ,సూట్లు బూట్లు వేసుకొని కార్పొరేట్ రాజకీయాలతో ఈ ప్రాంత ప్రజలను అణచి వేసి కోట్లకు పడగలెత్తారు తప్పా.. ఇక్కడి ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. మెరుగైన రవాణా వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, నేషనల్ హైవే, అడవులు, సింగరేణి, గోదావరి జిల్లాలు, కష్టించే యువకులు అన్ని వనరులు ఉన్నా మన కోల్బెల్ట్ ఏరియా పారిశ్రామికంగా అభివృద్ధి ఎందుకు చెందలేదో చెప్పాలని గత పాలకులు ఏమి సమాధానం చెప్తారని విమర్శించారు. గత పాలకులు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ పారిశ్రామికంగా ఎదగనివ్వకుండా చేశారని. వేరే ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెట్టి కోట్లు సంపాదించి మళ్ళీ ఇక్కడే రాజకీయాలు చేస్తున్నారని వారికి సిగ్గు ఉండాలన్నారు. నేడు అదే పాలకులు బీజేపీ ముసుగులో మళ్లీ ఈ ప్రాంత అస్తిత్వంపై , దెబ్బకొట్టాలని చూస్తున్నారని కానీ వాళ్ళ ఆటలు ఇక్కడ సాగవని తేల్చి చెప్పారు. సింగరేణి నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని ఏ ఒక్క బీజేపీ నా నాయకులు నోరెత్తితే ఒట్టని , కార్పొరేట్ రాజకీయాలు చేసే వాళ్లకు సింగరేణి ఒక సంస్థలా కనబడుతుందే తప్ప మరి ఎం లేదని తెలిపారు.
సింగరేణి అనేది ఈ ప్రాంత జీవన విధానం, ఎన్నో ఏళ్లుగా ప్రజలతో మమేకమై పెనవేసుకున్న పేగుబంధమని ఈ పట్టణాన్ని బొందల గడ్డగా ,మార్చకుండా, ఉండాలంటే..వర్తక, వాణిజ్య సంఘాలు తిరిగి పుంజుకోవాలంటే, వలసలు వెళ్లే వారిని ఆపాలంటే..
ఆటో సోదరులకు పూట,గడవాలంటే,చేతి వృత్తులు తిరిగి పుంజుకోవాలంటే,చిరు వ్యాపారుల్లో చిరునవ్వు చిందాలంటేకుల వృత్తుల వారు ఆర్థికంగా ఎదగాలంటే ,మన పట్టణ అస్తిత్వాన్ని, సింగరేణి సంస్థని మనమే కాపాడుకోవాలని సూచించారు.సింగరేణి ప్రైవేటీకరణ చేస్తే ఏ ఒక్క బిజెపి నాయకులను ఈ ఏరియాలో తిరగనివ్వమని తేల్చిచెప్పారు. నేడు బీజేపీ సిద్ధాంతాలను, కార్మిక వ్యతిరేక చర్యలను ఆ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రజలు అర్థం చేసుకోవాలని,రాష్ట్రవ్యాప్తంగా బీజెపీ ని బొంద పెడితేనే వారి దుర్మార్గపు చర్యలు బంద్ అవుతాయన్నారు. కార్మికుల, కర్షకుల పొట్ట కొట్టడమేనా బిజెపి సిద్ధాంతమని , సింగరేణి మాది మనది మనందరిదీ అనే భావన కార్మికులతో పాటు ప్రజలు కూడ ఉండాలని ప్రజలు కూడా ఏకం కావాలన్నారు. మందమర్రి పట్టణ ప్రాముఖ్యత కోల్పోకుండా ఉండాలని రూ.147 కోట్ల రూపాయలతో మందమర్రి పట్టణంలో అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచించి, సుమారు నలభై కోట్ల రూపాయలతో పట్టణంలో మౌలిక వసతుల కల్పన కల్పించమని ఏ ప్రభుత్వం చేయని పని తెలంగాణ సర్కారు చేస్తుందని తెలిపారు.రూ.40 కోట్లతో మందమర్రి పట్టణంలో అర్బన్ భగీరథ పనులుకొనసాగుతున్నాయని రూ.7 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు కొనసాగుతున్నాయని రూ. 12.50 కోట్ల రూపాయలతో మందమర్రి ఆర్ఓబి ఒక్క ఇల్లు కూల్చకుండా కడుతున్నామన్నారు. రూ.29.68 కోట్ల తో 560 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణలు దాదాపుగా పూర్తయ్యానట్లు వారు గుర్తు చేశారు. పట్టణంలో రెండు మినీ ట్యాంక్ బండ్ లు కడుతున్నమని , గల్లీలో సిసి రోడ్ల నుంచి మార్కెట్లో సెంట్రల్ లైటింగ్ వరకు ఎన్నో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఈ పనులన్నీ నిత్యం మొరిగే బిజెపి నాయకుల గాని, కార్పొరేట్ దుష్టశక్తుల గాని, ఇక్కడ మంత్రులుగా వెలగబెట్టిన కాంగ్రెస్ దద్దమ్మలకు గాని కనబడవన్నారు.ఈ రాక్షసులే మన ప్రాంత ప్రజలపై, బతుకులపై, పొట్టపై కొడుతుంటే తట్టుకోలేక నేడు వాళ్లందరూ టిఆర్ఎస్ తో కలిసి వస్తున్నారని తెలిపారు. గనులు మూతపడుతున్న, అక్కడి కార్మికులు వలస పోతున్నా. ఏ ఒక్క నాయకుడు ఆ ప్రాంతంపై దృష్టి సారించకపోవడం సిగ్గుచేటని
వేరే చోట ఫ్యాక్టరీ లు పెట్టి కోట్లు కొల్లగొట్టారు తప్ప మన వాళ్లకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. జీవనోపాధి కలిగించలేదని మండిపడ్డారు.ఇప్పుడు అదంతా గతం, మసకబారిన ఆ చరిత్రకి దుమ్ముదులుపుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ గా మార్పు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. సుమారు రూ.84 కోట్లతో క్యాతనపల్లి మున్సిపాలిటీకి వెచ్చించి రామకృష్ణాపూర్ పట్టణానికి పూర్వవైభవం కోసం కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు.
గత పాలకులు సూట్లు, సుటుకేసులు, మందు మటన్ కి ఇచ్చిన ప్రాధాన్యత..ఇక్కడి ప్రాంత ప్రజలకు ఇస్తే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదని , ఈ రెండు పట్టణాలు విద్య, వైద్యం, పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందితే లక్ష మందికి పైగా మేలు జరుగుతుందని మనకు కావల్సిoది కూడా అదేనని, చీకటి గుహ లోకి పోయేలా ఉండే చెన్నూరు రోడ్డుని రూ.15 కోట్ల అద్భుతంగా తీర్చిదిద్దామని ,కనీసం ఒక రోడ్డు కూడా వేయలేని సన్నాసులు దద్దమ్మలు గత పాలకున్నారు.
నేడు చెన్నూరు మున్సిపాలిటీలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని
పక్కనే ఉరకలెత్తే గోదారి తల్లి ఉన్నా, మన బీడు భూములకు ఒక చుక్క నీరు ఇచ్చిన పాపాన పోలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా త్వరలోనే లక్ష ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామని స్పష్టం చేశారు. దళితుల పేరు ఎత్తడానికి కూడా అర్హత లేని కొన్ని కుక్కలు నేడు దళిత బంధు పథకం పై మొరుగుతున్నాయని , 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఏ ఒక్కడు దళితులకి ఒక్క చిల్లిగవ్వ ఇచ్చిన పాపాన పోలేదని, వీరి పీడ తొలగిపోవాలంటే ఓటు అనే మహా యజ్ఞమే పరిష్కారమన్నారు.రేవంత్ రెడ్డి ఒక పిచ్చోడు ,ఆ పిచ్చి తగ్గడానికి ఖర్చుల కోసం చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు ఒక రూపాయి సహాయం చేయండని ఎద్దేవా చేశారు. నమ్మి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే నట్టేట ముంచారని, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారో లేదో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదన్నారు. టిఆర్ఎస్ పార్టీ లో చేరిన వారిలో మందమర్రి బీజేపీ పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్ , జైపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిప్పకుర్తి వెంకన్న , యువ నాయకులు వేల్పుల కిరణ్ తో పాటు వెయ్యి మంది తదితర పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు , కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ , నాయకులు రాo వేణు జైపూర్ టిఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.