విశాఖపట్నం బీచ్ కంపు కొడుతోంది

ఒకవైపు పర్యాటకులు బీచ్‌ అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. మరోవైపు డ్రైనేజీ వచ్చి సముద్రంలో చేరుతుంది. ఇంక ఆ ప్లేస్‌లో పర్యాటకులు ఫొటోలు దిగడం ఆపేసి..ఇదేంటి డ్రైనేజీ వాటర్‌ వచ్చి సముద్రంలో కలుస్తోంది…రోజు ఇందులోనేనా మనం స్నానాలు చేసి ఆడుకుంటుంది అనే అనుమానంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇదంతా ఎక్కడో కాదు మన ఆర్కే బీచ్‌లో కనిపించిన దృశ్యం..! ఆంధ్రప్రదేశ్ (ఒకవైపు పర్యాటకులు బీచ్‌ అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. మరోవైపు డ్రైనేజీ వచ్చి సముద్రంలో చేరుతుంది. ఇంక ఆ ప్లేస్‌లో పర్యాటకులు ఫొటోలు దిగడం ఆపేసి..ఇదేంటి డ్రైనేజీ వాటర్‌ వచ్చి సముద్రంలో కలుస్తోంది…రోజు ఇందులోనేనా మనం స్నానాలు చేసి ఆడుకుంటుంది అనే అనుమానంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇదంతా ఎక్కడో కాదు మన ఆర్కే బీచ్‌లో కనిపించిన దృశ్యం..! ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రదేశ్ ) రాష్ట్రంలో ఉన్న అందమైన నగరాల్లో విశాఖపట్నం (విశాఖపట్నం ) ఒకటి. ఈ నగరానికివిశాఖ ఆర్కే బీచ్ నిత్యం పర్యటకలు వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు.. పర్యాటకులతో కిటకిటలాడే ఆర్కే బీచ్ ఇప్పుడు కంపు కొడుతుంది. దానికి కారణం పర్యాటకులు స్నానం చేసే ప్రాంతంలోనే మురుగు నీరు వచ్చి చేరుతుండటం. విశాఖ ఆర్కే బీచ్ బస్ స్టాప్ నుండి నోవాటెల్‌ హోటల్ మధ్య ఉన్న డ్రైనేజీ కాలవ సముద్రంలోకి రావడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బీచ్ కొచ్చే పర్యటకులు స్నానాలు చేస్తూ ఉంటే పక్కనే డ్రైనేజీ కాలవ సముద్రంలోకి వచ్చి కలుస్తుంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.స్నానాలు చేసే ప్రదేశంలో మురికి నీరు వస్తే స్నానాలు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందని, ఈ కాలవ విశాఖ ఆర్కే బీచ్‌కు ఉన్న పేరును చెడగొడుతుందని స్థానికులు మండిపడుతున్నారు. పర్యాటకంగా అభివృద్ధి అవుతున్న విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద ఈ డ్రైనేజీ కాలవ సముద్రంలో కలవడంతో పర్యాటకుల తాకిడి అక్కడ తగ్గుతుంది. విశాఖపట్నం జీవీఎంసీ అధికారులు చొరవ తీసుకొని ఈ కాలువ ద్వారా వస్తున్న డ్రైనేజీకి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇతర ప్రదేశానికి వెళ్లే విధంగా చేయాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ బీచ్ చుట్టూ ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్ లతో పాటు పార్క్ లు, మ్యూజియంలు వంటి అనేక పర్యాటక ఆకర్షణలు ఇక్కడ ఉంటాయి. పొడవైన ఈ బీచ్ రోడ్డులో సైకిల్ రైడ్ చేసే వీలుంది. బీచ్ దృశ్యాలను చూస్తూ రాత్రి బస చేయాలనుకునే పర్యాటకుల కోసం బీచ్ రోడ్డులో అనేక హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇంత పర్యాటక ఆకర్షణ ఉన్న ప్రాంతంలో ఈ మురుగునీటి వల్ల టూరిస్టులు తగ్గితే అది టూరిజంమీదే దెబ్బతీసే అవకాశం ఉంది. సుందరనగరం అని పేరున్న విశాఖకు ఇలాంటి ఘటనల వల్ల చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు ఇప్పటికైనా పటిష్ట చర్యలు చేపట్టి ఆర్కేబీచ్‌ విశిష్టతను కాపాడాలని విశాఖ వాసులు కోరుతున్నారు.(ఆంధ్ర ప్రదేశ్ )రాష్ట్రంలో ఉన్న అందమైన నగరాల్లో విశాఖపట్నం (విశాఖపట్నం ) ఒకటి. ఈ నగరానికి

విశాఖ ఆర్కే బీచ్ నిత్యం పర్యటకలు వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు.. పర్యాటకులతో కిటకిటలాడే ఆర్కే బీచ్ ఇప్పుడు కంపు కొడుతుంది. దానికి కారణం పర్యాటకులు స్నానం చేసే ప్రాంతంలోనే మురుగు నీరు వచ్చి చేరుతుండటం. విశాఖ ఆర్కే బీచ్ బస్ స్టాప్ నుండి నోవాటెల్‌ హోటల్ మధ్య ఉన్న డ్రైనేజీ కాలవ సముద్రంలోకి రావడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బీచ్ కొచ్చే పర్యటకులు స్నానాలు చేస్తూ ఉంటే పక్కనే డ్రైనేజీ కాలవ సముద్రంలోకి వచ్చి కలుస్తుంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

స్నానాలు చేసే ప్రదేశంలో మురికి నీరు వస్తే స్నానాలు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందని, ఈ కాలవ విశాఖ ఆర్కే బీచ్‌కు ఉన్న పేరును చెడగొడుతుందని స్థానికులు మండిపడుతున్నారు. పర్యాటకంగా అభివృద్ధి అవుతున్న విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద ఈ డ్రైనేజీ కాలవ సముద్రంలో కలవడంతో పర్యాటకుల తాకిడి అక్కడ తగ్గుతుంది. విశాఖపట్నం జీవీఎంసీ అధికారులు చొరవ తీసుకొని ఈ కాలువ ద్వారా వస్తున్న డ్రైనేజీకి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇతర ప్రదేశానికి వెళ్లే విధంగా చేయాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ బీచ్ చుట్టూ ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్ లతో పాటు పార్క్ లు, మ్యూజియంలు వంటి అనేక పర్యాటక ఆకర్షణలు ఇక్కడ ఉంటాయి. పొడవైన ఈ బీచ్ రోడ్డులో సైకిల్ రైడ్ చేసే వీలుంది. బీచ్ దృశ్యాలను చూస్తూ రాత్రి బస చేయాలనుకునే పర్యాటకుల కోసం బీచ్ రోడ్డులో అనేక హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇంత పర్యాటక ఆకర్షణ ఉన్న ప్రాంతంలో ఈ మురుగునీటి వల్ల టూరిస్టులు తగ్గితే అది టూరిజంమీదే దెబ్బతీసే అవకాశం ఉంది. సుందరనగరం అని పేరున్న విశాఖకు ఇలాంటి ఘటనల వల్ల చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు ఇప్పటికైనా పటిష్ట చర్యలు చేపట్టి ఆర్కేబీచ్‌ విశిష్టతను కాపాడాలని విశాఖ వాసులు కోరుతున్నారు.