విశ్వబ్రాహ్మణుల డిమాండ్లను నెరవేర్చాలి

మంచిర్యాల : విశ్వ బ్రాహ్మణుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ భీమారం మండల కేంద్రంలో స్థానిక తాసిల్దార్ వాసంతికి కి ఆ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ విశ్వబ్రాహ్మణ ,విశ్వకర్మ ఐక్య సంఘం మండల అధ్యక్షుడు గర్రెపల్లి సత్యనారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల కోట్లతో విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని స్వర్ణకార వడ్రంగి పని చేసేవారికి పనులు లేక వలస కార్మికులు మారుతున్న వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలిపారు. మండల కేంద్రంలో 10 గుంటల స్థలంలో విశ్వకర్మ భవనం నిర్మించాలని ఆది ఆధునీకరణలో భాగంగా పంచదాయి కుల వృత్తులకు శిక్షణని ఇచ్చి సాయం అందించాలని వారు కోరారు. కల్లుగీత కార్మికులకు పద్మశాలి లకు ఇచ్చినట్టుగా విశ్వబ్రాహ్మణుల కూడా పింఛన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణ పురోహితులకు దేవాలయాలలో పురోహితులుగా నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు పూసల రుద్ర శర్మ ,గణముక్కుల రాజమౌళి , రంగు నరేందర్ ,మెరాడి కొండ సత్యనారాయణ, వెంకటయ్య ,చొప్పదండి రామకృష్ణయ్య , పూసల రాజు ,చెన్నోజు మనోహర్ బ్రహ్మయ్య ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.