*సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి*
మహా వెలుగు,కురవి, ఆగష్టు 04: మండల కేంద్రంలో వీఆర్ఏలు తాసిల్దార్ కార్యాలయం నుండి గుడి సెంటర్ వరకు ప్రదర్శనగా నినాదాలు చేస్తూ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి వారికి సంపూర్ణ మద్దతు తెలిపి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పట్ల ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంబించడం తగదని, ఇప్పటికే తమ తుగ్లక్ విధానాల వల్ల రెవెన్యూ వ్యవస్థ బ్రష్టు పట్టినదని దీనితో ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా లేదని, వీఆర్ఏల సమ్మెతో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా సుప్తావస్థలోకి దిగజారిందని ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయనీ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
