మహా వెలుగు, ప్రతినిధి మహబూబాబాద్ 13 : రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో మహబూబాబాద్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం. సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని మాట్లాడుతూ..
యాసంగి వడ్లు కేంద్రం కొనలేని పరిస్థితుల్లో సీఎం కేసిఆర్ నిన్న కేబినెట్ లో రాష్ట్రంలో పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది, కనీస మద్దతు ధర ఇస్తుందని నిర్ణయం తీసుకున్నారనీ తెలిపారు.రాష్ట్ర రైతాంగం కొద్ది రోజులుగా పడుతున్న ఆందోళనకు ఫులి స్టాప్ పెట్టారు.యాసంగి లో తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం షరతులు పెట్టడం, కచ్చితంగా కొనాలని సీఎం కేసిఆర్ కొట్లాడడం చూశాం.
ఈ పరిస్థితి ముందే ఊహించి యాసంగిలో తక్కువ వరి వేయాలని సీఎం కేసిఆర్ రైతులను కోరిన మేరకు ఈసారి 20 లక్షల ఎకరాల్లో తక్కువ వరి సాగు చేశారని
అయినా ఈ ధాన్యం కూడా కొనమని కేంద్రం అనడంతో… రైతులకు అండగా నిలబడాలని నిన్న జరిగిన సమావేశంలో సీఎం కేసిఆర్ గారు నిర్ణయం తీసుకున్నారనీ ఈ నిర్ణయం పట్ల సీఎం కేసిఆర్ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.ఈసారి వేసిన పంటలో విత్తనాలు, సొంత అవసరాలకు పోను.. ఎంత అమ్మకానికి వస్తుందనీ అంచనా వేసి ఆ ధాన్యం సేకరణకు తగిన ఏర్పాట్లు చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనీ అధికారులకు ఆదేశించారు.
నిన్నటి కేబినెట్ లో సీఎం కేసిఆర్ నిర్ణయంతో వరి కోతలు ఇపుడు మరింత వేగంగా జరుగుతాయనీ 1960/- రూపాయల కనీస మద్దతు దరకి కొనుగోలు చేస్తాం, తక్కువ ధరకు అమ్మాల్సిన పని లేదన్న సీఎం నిర్ణయం వల్ల రైతులు ఆందోళన పడొద్దనీ కోరారు.
గత అనుభవాల నేపథ్యంలో ఈసారి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలనీ కోరారు.
రైస్ మిల్లర్లు కూడా రైతులకు సంపూర్ణంగా సహకరించాలనీ, రైతులను బ్లాక్ మెయిల్ చేయడం, ఆలస్యం చేయడం, ఇబ్బంది పెట్టడం మంచిది కాదు సూచించారు. ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంటే… ఆ విధంగా ధాన్యం రైస్ మిల్లర్లు తీసుకోవాలనీ,రైతు 6 నెలల కష్టం చాలా విలువైంది. కాబట్టి కొనుగోలు విషయంలో అందరూ కలిసి ఉమ్మడి బాధ్యతగా పని చేయాలనీ,ధాన్యం సేకరించిన వెంటనే డబ్బులు వస్తాయని సీఎం కేసిఆర్ హామీ ఇచ్చారనీ తెలిపారు. రైస్ మిల్లర్లతో కూడా సమావేశం పెట్టి వారితో చర్చిస్తాం అని తెలియచేశారు . ప్రతి 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉన్నారు. వారి సేవలు పూర్తిగా వినియోగించుకోవాలి కోరారు.
కలెక్టర్ శశాంక మాట్లాడుతూ…
జిల్లాలో 280 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ధాన్యం కేంద్రం పెడుతున్నాం. అవసరమైతే ఇంకా పెంచుకుంటాం. మిల్లింగ్ విధి విధానాలు రాగానే వాటిని అమలు చేస్తామనీ తెలిపారు. గత సారి రైతులను ధాన్యం క్లీన్ చేసి ఇవ్వమని కోరాం. వారు కూడా సహకరించారు. దీనికి మిల్లర్లు సహకరించారు. ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నాం.గన్ని బ్యాగులపై దృష్టి పెట్టాం.మిల్లర్ల వద్ద ఉన్న స్థలం బట్టి ధాన్యం సేకరణ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మన జిల్లాలో ఉండేలా ప్లాన్ చేశాం.తప్పని పరిస్థితుల్లో ఇతర జిల్లాల్లో గత సారి ఇచ్చామనీ,రవాణాలో కూడా ఇబ్బందులు రానివ్వమని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే వారికి శిక్షణ ఇస్తామని,కమిటీలు వేస్తామననీ తెలిపారు.పాక్స్ సొసైటీలు భాగస్వామ్యం ఉంటుందనీ తెలిపారు.
ఈ సమీక్ష సమావేశం లో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్,zp చైర్మన్ బిందు,అధికారులు పాల్గొన్నారు.
