- కమిషన్ల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం .
- అధికార పార్టీ ధర్నా చేయడం ఏంటి!! దళారీలుగా మారిన టిఆర్ఎస్ ప్రభుత్వం. బయ్యారంలో కేంద్ర ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. రైతు రుణమాఫీ,నష్టపోయిన పంటకు నష్ట పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పోడు భూములకు పట్టా, మహిళలకు సున్నా వడ్డీ పేరుకు మాత్రమే .
- వైయస్సార్ టి పి వ్యవస్థాపకురాలు తెలంగాణ ప్రభుత్వం పై ధ్వజం
మహా వెలుగు ప్రతినిధి,మహబూబాబాద్ 11 : మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజక వర్గం బయ్యారం మండలంలో వైయస్సార్ టిపి వ్యవస్థాపకులు వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈరోజు సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు బయ్యారంలో ప్రారంభమైనది.
బయ్యారం గాంధీ సెంటర్ వద్ద మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల దృష్టికి అనేక సమస్యలు ప్రజల ద్వారా పోటెత్తాయి.
ముఖ్యంగా పోడు భూములకు పట్టాలు, నిరుద్యోగ సమస్య, మహిళలకు సున్నా వడ్డీ రుణాలు రాకపోవడంపై, రైతు రుణమాఫీ పై, పింఛన్లు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం , బయ్యారం పెద్ద చెరువు కాలువల మరమ్మతులు తదితర అంశాలపై ప్రజలు వారి దృష్టికి తీసుకు వెళ్లారు.ఈ సమస్యలను సావధానంగా వింటూ వీటిపై షర్మిల తనదైన శైలితో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన లో అప్పుడున్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 35 వేల ఎకరాల పొడుగు భూములకు పట్టాలు ఇచ్చారని, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేశారని, ఆరోగ్యశ్రీ 108 సేవలు, 104 సేవలు, రైతు రుణమాఫీ, పంట నష్ట పరిహారం, ఉద్యోగ అవకాశాలు, డబుల్ బెడ్రూం ఇల్లు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ పెన్షన్ లు, అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని అందించారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ కావాలని ఉద్యమాలు నిర్వహించిన వారే తెలంగాణను వంచన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . వరి ధాన్యం విషయంలో ఈ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని ఇది పాలక పార్టీ ప్రతిపక్షమా అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం బయ్యారంలోనే కేంద్ర ప్రభుత్వ రంగ ఒక కర్మాగారం నిర్మించాలని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
ఉద్యోగాలు రాక ఇదే గ్రామానికి చెందిన ఒక యువకుడు ఉద్యోగం రావటం లేదని రైలు కింద తలపెట్టి చనిపోయాడని పోతూ పోతూ నా చావుకు కారణం కేసీఆర్ అని తెలిపాడని ఇది దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే మండలంలో ఒక గ్రామ పంచాయితీ ఈవో తన సొంత డబ్బులతో గ్రామాభివృద్ధికి డబ్బులు చెల్లించిన తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరిన పాలకులు అధికారులు పట్టించుకోకపోవడంతో అతడు మరణించాడు అని తెలిపారు.
కాలేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి భారీ ప్రాజెక్టుల టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, ప్రజాక్షేమం పక్కన పెట్టిందని విమర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు వేయకు ముందు ఓడ మల్లన్న ఓటు వేసిన తర్వాత బోడి మల్లన్న అనే చందంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు అని అన్న కెసిఆర్ ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఈ ప్రాంతంలో ఇవ్వలేదని, కాకతీయుల కాలం నాటి చెరువు వైఎస్సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004లో చెరువుకు గండి పడింది. యుద్ధ ప్రాతిపదికన చెరువు గండిని పూడిపించారని, ఆ తరువాత మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ఆ చెరువు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరును బయ్యారం చెరువు మళ్లించి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తానన్న ప్రభుత్వం ముద్దు నిద్రపోతోందని, ఇదే ప్రాంతంలో తులారాం ప్రాజెక్టు కాంగ్రెస్ గవర్నమెంట్ లో నిర్మించిన తర్వాత ఇంతవరకు శాశ్వత కాలువలు నిర్మించ లేదని ఈ ప్రాంతపు ఓట్లు కావాలి కానీ వాళ్ళ అభివృద్ధికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు.
ఈ పాదయాత్రలో బయ్యారం వైయస్సార్ టిపి పార్టీ నాయకులు మరియు ప్రజలు వైయస్ షర్మిల కు బ్రహ్మరథం పట్టారు.
