మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు.
శ్రావణ పూర్ణిమనే రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి పేర్లతో పిలుస్తారు. వాస్తవానికి భారతదేశంలో రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎపుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు లేవు. కానీ, పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథలు ఉన్నాయి. వృతాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకి కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి, విజయం సాధించారని అలా రాఖీ పుట్టిందని చెబుతారు.
మహాభారతంలో ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైనవారు […]
