దేశంలోనే అతిపెద్ద ప్లోటింగ్ సోలార్

– డైరెక్టర్ కాంతి భట్టాచార్య

భట్టాచార్య సందర్శన

కరీంనగర్ , రామగుండం : రామగుండం ఏన్‌టీపీసీని డైరెక్టర్‌(ప్రాజెక్టు విజువల్స్‌) కాంతి భట్టాచార్య బుధవారం సందర్శించారు. డైరెక్టర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్ర మల మంత్రిత్వ శాఖ సెక్రెటరీ అరుణ్‌ గోయల్‌ ఎన్‌టీపీసీలో పర్యటించారు. మధ్యాహ్నం హైద్రాబాద్‌ నుంచి ఎన్‌టీపీసీకి చేరుకున్న డైరెక్టర్‌, పరిశ్రమల సెక్రెటరీలకు ఎన్‌టీపీసీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్‌టీపీసీ రిజర్వాయర్‌లో నిర్మిస్తున్న 100 మెగావాట్ల ప్రాజెక్టును పరిశీలించారు. ఇప్పటికే 40 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌గా గుర్తింపు పొందిన ఈప్రాజెక్టు విశేషాలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రెoడు నెలల్లో 100 మెగావాట్లకు విస్తరించేలా చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్‌టీపీసీ డైరెక్టర్‌ భట్టాచార్య వెంట రామగుండం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.