తెలంగాణ : టిఆర్ఎస్ అధినేత, సీఎంకె.చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ నేటితో 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి.