నిరుపేద అమ్మాయి పెండ్లి కి బాల్క ఫౌండేషన్ అండ

మంచిర్యాల జిల్లా : నియోజకవర్గం జైపూర్ మండలం టేకుమట్ల గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబo అయిన సత్యమ్మ రాజయ్య దంపతుల కూతురు తేజస్వి వివాహానికి ఆర్థిక సహాయం చేయాలనీ నాయకులు ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరగా వెంటనే స్పందించి బాల్క ఫౌండేషన్ ద్వారా వివాహ ఖర్చులకు రూ.50వేల రూపాయల తో పాటు , భోజనానికి సంబందించిన ఖర్చులకు రూ. 22వేల రూపాయలు మొత్తం రూ. 72 వేల రూపాయలు అందిచడం జరిగింది. ఈకార్యక్రమంలో జైపూర్ మండల జడ్పీటీసీ మేడి సునీత , తిరుపతి స్థానిక ఎంపీటీసీ బడుగు రవి ,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ,సీనియర్ నాయకులు సత్యనారాయణ రావు, ఇందారం గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు సుంకరి శ్రీనివాస్ , సంపత్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు