రైతు బంధును అక్రమంగా లబ్ది పొందుతున్నారు

మంచిర్యాల జిల్లా : భీమారం తమకు భూమి లేకున్నా రైతుబంధు అక్రమంగా బందోబస్తు గా తింటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోతనపల్లి శివారులో సర్వే నంబర్ 284 /9 రామల్ల సుధాకర్ పేరిట నాలుగు ఎకరాల భూమి పట్టా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా పాస్ పుస్తకం నంబర్ టి 1520050193 ఉండగా 2018 సo. నుండి 2021 డిసెంబర్ వరకు రూ. 1.52 వేల అక్రమంగా లబ్ధి పొందారు. సుంకరి భర్త ,సుంకరి నారాయణ సర్వే నంబర్ 284/10 లో 3 ఎకరాల భూమి ఉండగా దాని పై రైతు బంధు క్రింద ఇప్పటి వరకు రూ. 1 లక్ష 14 వేలు అక్రమంగా తెలంగాణ ప్రభుత్వం నుండి లబ్దిపొందారు. దాసరి లక్ష్మీ భర్త శంకరయ్య పేరిట 2 ఎకరాల భూమి ఉండగా టి15020050242 గల పట్టా దారు పాస్ పుస్తకం ఉన్నది. కానీ వారికి భూమి ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. ఇప్పటి ప్రభుత్వం నుండి అక్రమంగా రూ.76 వేలు తీసుకున్నారు. అంతే కాకుండా అదే శివారు లో పెద్ద మొత్తం లో అక్రమ పట్టాలు ,పాస్ పుస్తకాలు పొంది. అక్రమంగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో అక్రమార్కులు రైతుబంధు ను అక్రమంగా లబ్ధి పొందుతున్నారు. అంతే కాకుండా స్థానిక బ్యాంక్ లో ఈ పత్రలు పెట్టి క్రాఫ్ లోన్ల్ లక్షల్లో కొల్లగొట్టారు. వీరి ఇంత తతంగం నడిచిన అధికారులు నిమ్మకు నీరెంత నట్లు ఉన్నారు. రెవెన్యూ అధికారులు ప్రధాన లోపo తోనే అక్రమంగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి. దీనిపై ఏఈవో అరుణ్ కుమార్ ను వివరణ కోరగా , తాసిల్దార్ కార్యాలయం నుండి పట్టాదారు పాసు పుస్తకాలు వస్తాయని దాని ప్రకారమే రైతుబంధు డబ్బులను జమ చేస్తున్నట్లు వారు తెలిపారు. దీనిపై తాసిల్దార్ జోష్న ను వివరణ కోరగా అలాంటిదేమైనా ఉంటే ఎంజాయ్ మెంట్ సర్వే నిర్వహించాలని వారు తెలిపారు.