భార్యని అందంగా లేవన్న భర్త.. తట్టుకోలేకపోయిన ఇల్లాలు..

  • ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త
  • కొద్దిరోజులకే కాపురంలో కలహాలు
  • అందంగా లేవంటూ వేధింపులు

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కడదాకా కలిసుంటానని కబుర్లు చెప్పాడు. కొద్దిరోజులు కాపురం చేశాక అందంగా లేవంటూ మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో ఊహించని పరిణామంతో ఆ భార్య కుంగిపోయింది. భర్త వేధింపులు భరించలేక దారుణ నిర్ణయం తీసుకుంది. ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.

మండలం జిన్గురి గ్రామంలో విషాద ఘటన వెలుగుచూసింది. అందంగా లేవంటూ భర్త వేధింపులు భరించలేక భార్య బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన మహేష్, అనిత(23)ను కొద్దికాలం కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత కొద్దిరోజులు కాపురం సాఫీగా సాగిపోయింది. రోజులు గడిచేకొద్దీ భర్త అసలు స్వరూపం బయటపడింది. అందంగా లేవంటూ భార్యను వేధించేవాడు.

ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకున్న భర్త అందంగా లేవంటూ హింసించడం మొదలుపెట్టాడు. కొద్దిరోజులు మౌనంగా భరించిన భార్య చివరికి దారుణ నిర్ణయం తీసుకుంది. భర్త వేధింపులు భరించలేక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అనిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేస్తున్నారు.