సింగరేణి ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉన్న ప్రతీ సింగరేణి ఉద్యోగికి రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేశారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సింగరేణి కాలరీస్ మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఎస్‌బీఐలో ఖాతాలున్న 35వేల మంది ఉద్యోగులకు ప్రయో జనం చేకూరనుంది. ఈ ఒప్పందం వచ్చే నెల 4 నుంచి అమల్లోకి వస్తుంది.మేరకు ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సింగ రేణి డైరెక్టర్లు బలరామ్, ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ సమక్షంలో ఇరు సంస్థల ఉన్నతా ధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ సూచనల మేరకు బలరామ్ ఈ చారిత్రక ఒప్పందంలో కీలక పాత్ర పోషించారన్నారు.