- జాతీయ రహదారి పై హైదరాబాద్ ఎన్ఫోర్స్ మెంట్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు
- ఆరు వాహనాలు సీజ్
మంచిర్యాల జిల్లా :తెలంగాణ నుండి మహారాష్ట్రలోని సిరొంచకు అక్రమంగా తరలుతున్న 220 క్విటాళ్ళ రేషన్ బియ్యంను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కోటపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామం సమీపంలోని జుతీయ రహదారి పై శనివారం ఉదయం టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ,సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ల బృందం నిర్వహించిన తనిఖీలలో భారీగా రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి పెద్ద మొత్తంలో రేషన్
బియ్యం తరలుతుండగా ఈ విషయాన్ని తెలుసుకున్న హైదరాబాద్ ఎన్ఫర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ టీం జాతీయ రహదారి నెం.63 పై తనిఖీలను నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి10 గంటల వరకు తనిఖీలను నిర్వహించగా, ఈ తనిఖీలలో ఆరు వాహనాలలో తరలుతున్న రేషన్ బియ్యంను , హైదరాబాద్ ఎన్ఫోర్స్ మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకొని రేషన్
బియంను చెన్నూర్ ఎంఎస్ పాయింట్ కు తరలించారు. స్వాదీనం చేసుకున్న వాహనాలను కోటపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన అధికారులు బియ్యం రవాణా చేస్తున్న ఏ తిరుపతి, డి.సుదాకర్, ఎం రవి, టి రాము, టి రాజు, ఎన్ సాయి, టి రవిల పై కేస్ నమోదు చేశారు. ఈ దాడులలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేంకుమార్, డిప్యూటీ తహసీల్దార్ వరదరాజులు,
విజయ పాల్గొన్నారు.