దేశ రాజకీయాల్లో పోరాడనున్నట్లు నారాయణ్ ఖేడ్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ' పోదామా జాతీయ రాజకీయాల్లో కి ? ఢిల్లీ దాకా కొట్లాడుదామా ? భారతదేశాన్ని బాగు చేద్దామా ? ఎట్లైతే తెలంగాణ ను బాగు చేసుకున్నామో అదే పద్దతి లో దేశాన్ని బాగు చేసుకుందాం. ఈ దేశాన్ని గొప్ప దేశంగా తయారు చేసుకుందాం పోరాటానికి నేను రెడీ గా బయలుదేరాను మీ అందరి దీవెన ఇలాగే ఉండాలి అని ప్రజలను కోరారు.