మంచిర్యాల మహా వెలుగు : విధులు నిర్వహిస్తున్న పంచాయితీ కార్యదర్శి పై ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటన భీమారo మండలo లోని దంపూర్ లో వివాద స్పదంగ మారింది.. పంచాయతీ కార్యదర్శి బి. దేవందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… దంపూర్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ సమావేశo నిర్వహిస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన చెకొండ శ్రీనివాస్ అకారణంగా దాడి చేసి కొట్టారని ఆవేదన వ్యక్తి చేశాడు. దీనితో మండలంలోని 11 గ్రామ పంచాయతీల కార్యదర్శిల తో పాటు ఎంపివో శ్రీపతి బాపు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి పై దాడి కండిస్తున్నట్లు వారు తెలిపారు.