అల్లంనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ భార్య అల్లం పద్మ మరణించిన నేపథ్యంలో అల్లం నారాయణ కుటుంబాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు, హోం మంత్రి మహముద్ అలీ పరామర్శించారు. పద్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు ఉన్నారు.