అటవీ శాఖ విధులకు ఆటంకo కలిగిస్తే చర్యలు తీసుకుంటామని చెన్నూర్ డివిజన్ అధికారి ఎస్. రమేష్ హెచ్చరించారు. బుధవారం ఫారెస్ట్ అధికారులు ఓత్కులపల్లి గ్రామ శివారులో అటవీ భూమిలో హరిత హారంలో భాగంగా మొక్కలు నాటుటకు గుంతలు ఏర్పాటు చేస్తుండగా, అధికారుల విధులకు ఆటంకం కలిగించి ,అధికారుల పై దాడికి యత్నించి భూమిని కబ్జా చేయడానికి యత్నించిన మేకల ఓదెలు, కాటా వేనా లింగయ్య, మేకల పోచం, మేకల అంజన్న, మేకల లక్ష్మి, కాట వేణి లక్ష్మి ,మేకల మల్లక్క, మేకల ఒదక్కా , అను వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నామని ,వారిలో ముగ్గురి పై కేసులు నమోదు చేసి చెన్నూర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వారికి 15 రోజుల రిమాండ్ విధించడం జరిగిందని తెలిపారు. ఇదేవిధంగా సెగం చంద్రయ్య, జిమ్మిడి రాజయ్య , కాటవేన మల్లేష్, జాడి అంకయ్య, వారిపై పోలీసు కేసులు పెట్టి , అటవీ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు.. వారిని సైతం త్వరలో రిమాండ్ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గo లో ఫారెస్ట్ భూములు ఆక్రమించుట కు ప్రయత్నించిన, ఫారెస్ట్ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన యెడల వారి పై చట్టరీత్య చర్య తీసుకొనబడునని కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ పెట్టబడునని వారు తెలిపారు.