మహిళల అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ ధ్యేయమని అందుకోసమే సమ్మక్క- సారలమ్మ మహిళా భవన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గం లోని మందమర్రి మండలం ఆదిల్ పేట్ గ్రామంలో రూపాయలు 15 లక్షలతో నిర్మించే సమ్మక్క-సారలమ్మ మహిళా భవనంకు శుక్రవారం ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో లో మహిళల కోసం ప్రభుత్వం ముందుకు వేస్తుందని వారు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఆలోచన పరంగా ఎదగాలని ఉద్దేశంతో ఈ భవనాలు నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామంలోని సమ్మక్క – సారక్క భవనాలు మహిళలకు ఎంతో లాభసాటిగా మారతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి జడ్పిటిసి వేల్పుల రవి , ఎంపీపీ మంద శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ పున్నం , పిఎసిఎస్ చైర్మన్ ప్రభాకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.