చెన్నూర్‌లో శనివారం అర్ధరాత్రి సయ్యద్-షా-బాబా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ , తో పాటు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత హాజరయ్యారు. విప్ మాట్లాడుతూ మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుoటున్నట్లు వారు తెలిపారు. ఉత్సవాలకు పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దర్గా ప్రాంతంలో దుకాణాలు వెలువడడంతో పండుగ వాతావరణం నెలకొంది.భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు, మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్ నవాజొద్దీన్, అధ్యక్షుడు ఖాజా ఖంరొద్దీన్, జాఫర్ అలీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ప్రత్యేక ప్రార్ధన లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మోతే తిరుపతి తో పాటు , ఎంపీపీ మంత్రి బాపు , చెన్నూర్ పట్టణ కౌన్సలర్లు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.